మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా పిలవను: ఉద్ధవ్ థాకరే

| Edited By:

Dec 02, 2019 | 2:26 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఆదివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసలు, విమర్శలతో ముంచెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోల్‌ స్పీకర్‌గా, ఫడ్నవిస్‌ ప్రతిపక్ష నాయకుడిగా నూతనంగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ.. “నేను దేవేంద్ర ఫడ్నవిస్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహంగా ఉంటాను. నేను మిమ్మల్ని(ఫడ్నవిస్)​​ ప్రతిపక్ష నాయకుడిగా పిలవను, కాని నేను మిమ్మల్ని ‘బాధ్యతాయుతమైన’ నాయకుడిగా పిలుస్తాను” అని వివరించారు. […]

మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా పిలవను: ఉద్ధవ్ థాకరే
Follow us on

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఆదివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసలు, విమర్శలతో ముంచెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోల్‌ స్పీకర్‌గా, ఫడ్నవిస్‌ ప్రతిపక్ష నాయకుడిగా నూతనంగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ.. “నేను దేవేంద్ర ఫడ్నవిస్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహంగా ఉంటాను. నేను మిమ్మల్ని(ఫడ్నవిస్)​​ ప్రతిపక్ష నాయకుడిగా పిలవను, కాని నేను మిమ్మల్ని ‘బాధ్యతాయుతమైన’ నాయకుడిగా పిలుస్తాను” అని వివరించారు.

మొదట మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్సీపీ శివసేన, కాంగ్రెస్ లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి. దీంతో.. బలపరీక్షలో తగిన మద్దతు లేక ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శివసేన నేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.