జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం…

|

Dec 16, 2019 | 6:02 AM

రాష్ట్రా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ఒక్కొ అడుగు ముందుకేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏపీలో దిశ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే.. మహిళలకు రక్షణ కల్పించడం కోసం జగన్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ‘దిశ యాక్ట్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే […]

జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం...
Follow us on

రాష్ట్రా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ఒక్కొ అడుగు ముందుకేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏపీలో దిశ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే.. మహిళలకు రక్షణ కల్పించడం కోసం జగన్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ‘దిశ యాక్ట్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో జగన్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేవినేని అవినాష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుల ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకాలు చేశారు. టీడీపీ హయాంలో కాల్‌మనీ పేరుతో మహిళలు వేధింపులకు గురయ్యారని.. ఇప్పుడు మహిళల రక్షణ కోసం సీఎం జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఎంతో అభినందనీయం అని అన్నారు.

ఇకపోతే ‘దిశ యాక్ట్’ ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలతో నిజ నిర్ధారణ జరిగితే ఉరి శిక్షే గతి. 21రోజుల్లో పూర్తి విచారణ చేపట్టి.. తీర్పును వెల్లడించనున్నారు. దీని కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.