
హర్యానాలోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ఓ కారు డ్రైవర్ హల్ చల్ చేశాడు. టోల్ గేట్ వద్దకు కారు వచ్చి ఆగిన తర్వాత.. టోల్ గేట్ క్యాబిన్లో ఉన్న మహిళా ఉద్యోగి టోల్ఛార్జీ అడిగింది. టోల్ఛార్జీ ఇవ్వకుండా ఆమె పట్ల కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆమె చెంప మీద కొట్టాడు. దీంతో ఆమె కూడా అతడి పై దాడి చేసే ప్రయత్నం చేసింది. అక్కడున్న వారు డ్రైవర్ను పట్టుకుని చడా మడా వాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్గా మారింది.