ఏపీ సీఎస్ రేసులో మహిళా అధికారి..?

| Edited By:

Nov 05, 2019 | 3:55 PM

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై ఇప్పుడు కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి సీఎస్‌గా మహిళా అధికారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో 1984 క్యాడర్‌కు చెందిన నీలం సహాని పేరు కొత్త సీఎస్ లిస్ట్‌లో బలంగా వినిపిస్తోంది. ఎల్వీ సుబ్రమణ్యం ఉద్వాసనతో వచ్చిన చెడ్డ పేరును […]

ఏపీ సీఎస్ రేసులో మహిళా అధికారి..?
Follow us on

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై ఇప్పుడు కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి సీఎస్‌గా మహిళా అధికారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో 1984 క్యాడర్‌కు చెందిన నీలం సహాని పేరు కొత్త సీఎస్ లిస్ట్‌లో బలంగా వినిపిస్తోంది. ఎల్వీ సుబ్రమణ్యం ఉద్వాసనతో వచ్చిన చెడ్డ పేరును పూడ్చుకునేందుకు మహిళా కోటాలో ఆమెకు స్థానం కల్పించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహాని.. ఉన్నపళంగా అమరావతికి కూడా వచ్చేశారట. ఇప్పుడు ఆమె సీఎం జగన్‌తోనే ఉన్నారని.. ఆయనతో కలిసి భోజనం కూడా చేశారని సమాచారం. కాగా ఏ పనిని అప్పగించినా.. దానిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, సమర్థవంతంగా చేయడంలో నీలం సహానికి మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇప్పటికే జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండగా..ఇప్పుడు సీఎస్ పదవి కూడా మహిళా అధికారికే ఇవ్వబోతుండటం విశేషం.