ప్రాణం పోయినా..వీడని అమ్మప్రేమ

|

Aug 12, 2019 | 5:39 PM

కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి. మట్టితో కూడిన వరద చాలా ప్రాంతాలను సజీవ సమాధి చేసింది. సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మల్లపురం జిల్లాలో భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. మట్టితో కూడిన వరద అనేక ఇళ్లను ఊడ్చిపెట్టుకుపోయింది. వరదల్లో అనేక మంది ప్రాణాలు కొల్పోయారు. కొట్టుకున్ను ప్రాంతంలో మట్టి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ తల్లీకొడుకుల మృతదేహాలు రెండు […]

ప్రాణం పోయినా..వీడని అమ్మప్రేమ
Follow us on

కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి. మట్టితో కూడిన వరద చాలా ప్రాంతాలను సజీవ సమాధి చేసింది. సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మల్లపురం జిల్లాలో భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. మట్టితో కూడిన వరద అనేక ఇళ్లను ఊడ్చిపెట్టుకుపోయింది. వరదల్లో అనేక మంది ప్రాణాలు కొల్పోయారు. కొట్టుకున్ను ప్రాంతంలో మట్టి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ తల్లీకొడుకుల మృతదేహాలు రెండు రోజుల తర్వాత బయటపడ్డాయి. సహాయక చర్యల్లో భాగంగా  ప్రొక్లెయిన్లతో మట్టిని తొలగిస్తుండగా తల్లీ బిడ్డాల మృతదేహాలు కనిపించాయి. వారిని చూసి అక్కడున్న అధికారులు, స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ప్రాణం పోతుందని తెలిసినా ఆ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అందరిని కలచివేసింది. బిడ్డను కాపాడాలనే ఆశతో కొడుకును పొత్తిళ్లలో దాచుకుని ప్రాణాలు కొల్పోయింది ఆ తల్లి. నిలువునా కప్పేసిన మట్టి కింద ప్రాణం లేని ఆ తల్లీ కొడుకుల్ని చూసిన వారి బంధువులు బోరున విలపించారు.