కాగితంపై పేర్లు రాసి కర్నూలులో క్షుద్రపూజలు

|

Oct 31, 2020 | 1:19 PM

ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు నగరాల నడిబొడ్డున క్షుద్రపూజలు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చనిపోయిన మనిషి పుర్రె దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు చేశారు కొందరు దుండగులు. అంతేకాదు అక్కడ కొందరి పేర్లు రాసి ఉన్న కాగితాన్ని ఉంచి క్షుద్రపూజలు చేశారు. దీంతో ఆ పేర్లు ఎవరివి ? ఎవరు ఈ క్షుద్రపూజలు చేశారనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు ఆ పేర్లు ఉన్న వ్యక్తుల్లో గుబులు మొదలైంది. కర్నూలు నగరంలో క్షుద్రపూజలు జరగడం […]

కాగితంపై పేర్లు రాసి కర్నూలులో క్షుద్రపూజలు
Follow us on

ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు నగరాల నడిబొడ్డున క్షుద్రపూజలు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చనిపోయిన మనిషి పుర్రె దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు చేశారు కొందరు దుండగులు. అంతేకాదు అక్కడ కొందరి పేర్లు రాసి ఉన్న కాగితాన్ని ఉంచి క్షుద్రపూజలు చేశారు. దీంతో ఆ పేర్లు ఎవరివి ? ఎవరు ఈ క్షుద్రపూజలు చేశారనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు ఆ పేర్లు ఉన్న వ్యక్తుల్లో గుబులు మొదలైంది. కర్నూలు నగరంలో క్షుద్రపూజలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలులోని జొహరాపురం రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర ప్రధాన రహదారిపై క్షుద్రపూజలు చేశారు దుండగులు. రోడ్డు పక్కనే పుర్రె, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పుర్రెకు ఓ కొబ్బరికాయతో దారం కట్టి, ఓ కాగితాన్ని కూడా ఆ పుర్రెకు కట్టడంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఎవరు ? ఎవరి కోసం ఈ క్షుద్రపూజలు చేయించారో తెలియక ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజలు చేసిన దగ్గర పేర్లు రాసిన ఓ కాగితం కనిపించింది. విశ్వనాథ్ కుటుంబీకులకు హాని జరగాలంటూ పేపర్ లో రాసి క్షుద్రపూజలు చేసినట్టు తెలుస్తోంది. విశ్వనాధ్‌తో పాటు మరికొందరు పేర్లు ఆ కాగితంపై రాసి ఉన్నాయి. పెద్ద లక్ష్మన్న, విశ్వనాధ్‌, రత్నం, మహేష్‌, ఏసు, మధు అనే పేర్లు కాగితంపై ఉన్నాయి. దీంతో ఆ పేర్లు ఉన్న వారి గుండెల్లో గుబులు మొదలైంది.