భారతీయులకు వికీపీడియా విఙ్ఞప్తి.. గతంలోనూ

| Edited By:

Jul 30, 2020 | 1:22 PM

నెట్టింట విఙ్ఞానాన్ని ప్రసాదించే వెబ్‌సైట్‌ ఏంటంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు వికీపీడియా. వికీపీడియా అనే ఫౌండేషన్‌ ఈ ఎన్‌సైక్లోపీడియాను ఎలాంటి లాభం ఆశించకుండా నిర్వహిస్తోంది.

భారతీయులకు వికీపీడియా విఙ్ఞప్తి.. గతంలోనూ
Follow us on

Wikipedia asking donations: నెట్టింట విఙ్ఞానాన్ని ప్రసాదించే వెబ్‌సైట్‌ ఏంటంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు వికీపీడియా. వికీపీడియా అనే ఫౌండేషన్‌ ఈ ఎన్‌సైక్లోపీడియాను ఎలాంటి లాభం ఆశించకుండా నిర్వహిస్తోంది. అందుకే నెటిజన్లకు, వికీపీడియాకు విడదీయని ఓ సంబంధం ఉంటుంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు విరాళాలు కోరుతోంది. గత కొన్ని రోజులుగా వికీపీడియాను ఓపెన్‌ చేసినప్పుడు అందులో ఓ మెసేజ్ కనిపిస్తోంది.

”వికీపీడియా స్వాతంత్య్రాన్ని ఇలానే ఉంచేందుకు మీ సాయం కోరుతున్నాం. వికీపీడియాను వాడుతున్న 98శాతం మంది విరాళాలను ఇవ్వడం లేదు. వారు మరో మార్గాన్ని చూసుకుంటున్నారు. మీరు రూ.150లు విరాళం ఇచ్చినట్లైయితే, వికీపీడియా సేవలు మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతాయి. వికీపీడియా వలన చాలా మంది తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే కొంతమంది విరాళాలు ఇస్తున్నారు. వికీపీడియా మీకు సంవత్సరంలో రూ.150ల ఙ్ఞానాన్ని ఇచ్చిందని భావిస్తే.. దయచేసి విరాళం ఇవ్వండి. మీ కోసం కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న వాలంటీర్ల కోసం సాయం చేయండి” అన్న మెసేజ్ కనిపిస్తోంది.

అయితే వికీపీడియాలో ఇలా కనిపించడం ఇది తొలిసారేం కాదు. 2015లో చిన్న విరాళాలు ఇవ్వండి అంటూ వికీపీడియా సంస్థ వెల్లడించింది. అక్కడ పనిచేసే ఎడిటర్లు, స్టాఫ్‌కు జీతాలు ఇచ్చేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. ఇక గతేడాది ఆగష్టులోనూ వికీపీడియా ఇలానే డొనేషన్లను కోరింది. మిగిలిన దేశాల ప్రజలను కూడా ఈ సంస్థ విరాళాలు అడుగుతున్నట్లు సమాచారం.

Read This Story Also: Bigg Boss 4: నాగార్జునకు భారీ రెమ్యునరేషన్‌