పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నందుకు.. విడాకులు కోరింది..

| Edited By:

May 01, 2019 | 12:22 PM

పబ్‌జీ గేమ్.. పరిచయం లేని గేమ్. ఈ గేమ్ వల్ల చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మంగళవారం కూడా పబ్‌జీ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఇక.. ఓ మహిళ విషయానికే వస్తే.. పబ్‌జీ గేమ్‌కు బానిసగా మారిన ఆమె తన భర్త నుంచి విడాకులు కోరడమే ఆశ్చర్యం. భర్త హింసించాడనో లేక తనను పట్టించుకోలేదనో సాధారణంగా మహిళలు విడాకులు కోరుతుంటారు. […]

పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నందుకు.. విడాకులు కోరింది..
Follow us on

పబ్‌జీ గేమ్.. పరిచయం లేని గేమ్. ఈ గేమ్ వల్ల చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మంగళవారం కూడా పబ్‌జీ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఇక.. ఓ మహిళ విషయానికే వస్తే.. పబ్‌జీ గేమ్‌కు బానిసగా మారిన ఆమె తన భర్త నుంచి విడాకులు కోరడమే ఆశ్చర్యం.

భర్త హింసించాడనో లేక తనను పట్టించుకోలేదనో సాధారణంగా మహిళలు విడాకులు కోరుతుంటారు. తాజాగా.. అజ్మన్‌లో ‘పబ్‌జీ’ గేమ్ ఆడొద్దన్నందుకు తన భర్త నుంచి విడాకులు డిమాండ్ చేసింది ఓ భార్య. ఇది విన్న న్యాయ స్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అయితే.. పబ్ జీ గేమ్‌ను తాను కేవలం స్నేహితులు, బంధువులతోనే ఆడతానని స్పష్టం చేసింది ఆ మహిళ. అయితే.. ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదనీ, కేవలం పబ్ జీకి బానిస కాకూడదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండాలని కోరానని భర్త తెలిపాడు. ఈ కేసు విచారించిన కోర్టు త్వరలోనే విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది.