ఒక షార్ట్ ఫిల్మ్‌తో… ఆరు దేశాల్లో యూట్యూబ్ బ్యాన్!

| Edited By: Pardhasaradhi Peri

Nov 28, 2019 | 8:08 PM

సోషల్ నెట్‌‌వర్కింగ్ సైట్లలో ముందు వరుసలో గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. గూగుల్ అనుబంధ సంస్థల్లో ఒకటైన యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆరు దేశాల్లో ఏకంగా యూట్యూబ్ బ్యాన్ ఎదుర్కొంది. చూడడానికి వింతగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. అసలు ఆ షార్ట్ ఫిలిం ఏంటి.. ఎందుకని ఆ ఆరు దేశాల్లో బ్యాన్ అయిందో ఇప్పుడు చూద్దాం.. ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంబందించిన ట్రైలర్ యూట్యూబ్‌లో ఇలా […]

ఒక షార్ట్ ఫిల్మ్‌తో... ఆరు దేశాల్లో యూట్యూబ్ బ్యాన్!
Follow us on

సోషల్ నెట్‌‌వర్కింగ్ సైట్లలో ముందు వరుసలో గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. గూగుల్ అనుబంధ సంస్థల్లో ఒకటైన యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆరు దేశాల్లో ఏకంగా యూట్యూబ్ బ్యాన్ ఎదుర్కొంది. చూడడానికి వింతగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. అసలు ఆ షార్ట్ ఫిలిం ఏంటి.. ఎందుకని ఆ ఆరు దేశాల్లో బ్యాన్ అయిందో ఇప్పుడు చూద్దాం..

‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంబందించిన ట్రైలర్ యూట్యూబ్‌లో ఇలా విడుదలైందో లేదో.. ఏకంగా ఆరు దేశాల్లో బ్యాన్ ఎదుర్కోవడానికి కారణమైంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, సౌత్ సుడాన్, సుడాన్ దేశాలు యూట్యూబ్‌ను బ్యాన్ చేయడం జరిగింది.

ఆఫ్గనిస్తాన్ :

సెప్టెంబర్ 12,2012లో యూట్యూబ్‌లో మహ్మదీయులను ఉద్దేశిస్తూ ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్‌ను విడుదల చెయ్యడంతో.. అది కాస్తా ఇస్లాంను కించపరిచే విధంగా ఉండటంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం ౩ నెలల పాటు యూట్యూబ్‌ను బ్యాన్ చేసింది… ఇక ఆ తర్వాత డిసెంబర్ 1న  పునరుద్దరించింది.

బంగ్లాదేశ్:

అప్పటికే 2009లో ప్రభుత్వపరమైన కారణాల వల్ల కొన్ని రోజులు బ్యాన్‌ను ఎదుర్కున్న యూట్యూబ్… సెప్టెంబర్ 17, 2012న రెండవసారి ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్‌ను విడుదల చేయడంతో వివాదాలు చెలరేగాయి. దాదాపు సంవత్సరం పాటు.. జూన్ 5, 2013 వరకు బంగ్లాదేశ్ టెలీ కమ్యూనికేషన్ రెగ్యులేటరి కమిషన్ బ్యాన్‌ను విధించింది.

పాకిస్తాన్:

2008 నుంచి 2017 మధ్యకాలంలో సంవత్సరానికి ఒక్కసారైనా యూట్యూబ్ బ్యాన్ కావడం పాకిస్తాన్‌లో సర్వ సాధారణం. ఇక ఈ ట్రైలర్ కారణంగా.. సెప్టెంబర్ 17 2012న పాకిస్తాన్ టెలీ కమ్యూనికేషన్ సంస్థ యూట్యూబ్‌ను బ్యాన్ చేసింది. అప్పుడు స్వచ్ఛంద సంస్థ అయిన ‘బైట్స్ ఫర్ ఆల్’ తన న్యాయవాది అయిన యాసిర్ లతీఫ్ హందాని ద్వారా ఈ నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఇక ఇది ఇప్పటికీ సాగుతున్న కేసు అని.. దీనిని యూట్యూబ్ కేసుగా ప్రజలు వ్యవహరిస్తారని పేర్కొంది.

మరోవైపు ఇరాన్‌లో 2009లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కారణంగా ఒకసారి యూట్యూబ్ బ్యాన్ కాగా.. ఆ తర్వాత మళ్ళీ 2012లో ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ ట్రైలర్ వల్ల రెండోసారి ఈ దేశంలో యూట్యూబ్ బ్యాన్ కావడం జరిగింది. ఇక సుడాన్‌లో సెప్టెంబర్ 17,2012న ఈ దేశంలో కూడా రెండోసారి యూట్యూబ్ బ్యాన్ అయింది. అదీ కూడా ఈ ట్రైలర్ కారణంగా జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాన్ ఎత్తేశారు.

సౌత్ సుడాన్:

ఇస్లామిక్ మతానికి విరుద్ధంగా విడుదలైన ‘Innocence of Muslims’ ట్రైలర్ కారణంగా ఇప్పటికీ ఈ దేశంలో యూట్యూబ్ బ్యాన్‌లోనే ఉంది.