నల్లధన కుబేరులపై మౌనం.. మోదీజీ..! ఎందుకీ జాప్యం..?

| Edited By: Pardhasaradhi Peri

Sep 09, 2019 | 1:24 PM

స్విస్ బ్యాంకులు.. ఈ మాట వినగానే.. మన భారతీయులు.. దాచుకున్న డబ్బే గుర్తుకొస్తుంది. చాలా మంది భారతీయులు.. నల్లధనంను.. స్విస్‌ బ్యాంకుల్లో దాచుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలోనే.. భారతీయుల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తానని పీఎం నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్నట్టుగా.. దానికి సంబంధించి.. స్విట్జర్లాండ్ అధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడారు కూడా. ముందు కాదు.. లేదు.. అని సమాచారమిచ్చిన బ్యాంక్ అధికారులు.. మోదీ ఇన్వాల్వ్‌మెంట్‌తో.. ఆఖరికి సరేనని ఒప్పుకున్నారు. దీంతో.. తమగుట్టు […]

నల్లధన కుబేరులపై మౌనం.. మోదీజీ..! ఎందుకీ జాప్యం..?
Follow us on

స్విస్ బ్యాంకులు.. ఈ మాట వినగానే.. మన భారతీయులు.. దాచుకున్న డబ్బే గుర్తుకొస్తుంది. చాలా మంది భారతీయులు.. నల్లధనంను.. స్విస్‌ బ్యాంకుల్లో దాచుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలోనే.. భారతీయుల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తానని పీఎం నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్నట్టుగా.. దానికి సంబంధించి.. స్విట్జర్లాండ్ అధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడారు కూడా. ముందు కాదు.. లేదు.. అని సమాచారమిచ్చిన బ్యాంక్ అధికారులు.. మోదీ ఇన్వాల్వ్‌మెంట్‌తో.. ఆఖరికి సరేనని ఒప్పుకున్నారు. దీంతో.. తమగుట్టు ఎక్కడ రట్టవుతుందని చాలా మంది అకౌంట్లు క్లోజ్ చేసినట్టు సమాచారం.

కాగా.. స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న వారి సమాచారం ఇప్పటికే భారత ప్రభుత్వానికి చేరింది. అక్రమంగా ధనం తరలించిన వారిపై బలమైన కేసులు నమోదు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని మోదీ భావిస్తున్నారు. తొలివిడతలో క్లోజ్ అయిన ఖాతాల్లో.. డబ్బులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ గురించి ఎక్కడ బయటపడుతుందోమోనని.. 2018లోనే చాలా మంది నల్లధన కుబేరులు తమ ఖాతాలను క్లోజ్ చేశారు. కొంతమంది తెలివిగా వారి తమ సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు.

అయితే… ఇప్పటికే రిలీజైన లిస్ట్‌ను బయటపెట్టడంలో మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి సదరు కీలక సమాచారం వచ్చిన నేపథ్యంలో.. నల్ల కుబేరుల పనిబడతానంటూ.. ప్రకటించిన ప్రధాని మోదీ.. ఈమేరకు ఏ విధమైన చర్యలకు ఉపక్రమిస్తారో అన్న విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. సమయం చూసి.. ఈ విషయాన్ని బయట పెడదామని.. మోదీ చూస్తున్నట్లు తెలుస్తోంది.