జాబిల్లికి ఎందుకు చేరుకోలేకపోయామంటే..?

| Edited By:

Jul 16, 2019 | 11:57 AM

చంద్రయాన్ -2 ప్రయోగం వాయిదాపై ఇస్రో తాజా వివరణ ఇచ్చింది. ప్రయోగం ఫెయిల్ అవడానికి గల కారణాలను ఇస్రో సైంటిస్టులు వివరించారు. రాకెట్‌లో అత్యంత కీలకమైన క్రయోజెనిక్ దశలో లీకేజీ సమస్య ఏర్పడిందని.. ఇంధన ట్యాంక్‌లో పోగో గ్యాస్ బాలిక్ లీక్ కారణంగా ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు సమాచారం. గ్యాస్‌బాటిల్‌లో లీకేజీ జరిగితే ప్రయోగ తొలిదశలో వేగం తగ్గే అవకాశం ఉన్నందున క్రయోస్టేజ్‌లోని 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ తొలగించారని తెలిపారు. రెండో […]

జాబిల్లికి ఎందుకు చేరుకోలేకపోయామంటే..?
Follow us on

చంద్రయాన్ -2 ప్రయోగం వాయిదాపై ఇస్రో తాజా వివరణ ఇచ్చింది. ప్రయోగం ఫెయిల్ అవడానికి గల కారణాలను ఇస్రో సైంటిస్టులు వివరించారు. రాకెట్‌లో అత్యంత కీలకమైన క్రయోజెనిక్ దశలో లీకేజీ సమస్య ఏర్పడిందని.. ఇంధన ట్యాంక్‌లో పోగో గ్యాస్ బాలిక్ లీక్ కారణంగా ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు సమాచారం.

గ్యాస్‌బాటిల్‌లో లీకేజీ జరిగితే ప్రయోగ తొలిదశలో వేగం తగ్గే అవకాశం ఉన్నందున క్రయోస్టేజ్‌లోని 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ తొలగించారని తెలిపారు. రెండో దశలో 110 టన్నుల బరువున్న ద్రవ ఇంధనం తీసినట్టు చెప్పారు. క్రయోజెనిక్ దశలో మరో సమస్యను శాస్త్రవేత్తలు గుర్తించారు. సర్క్యూట్‌ సమయంలో పీడనం తగ్గినందువల్ల సాధారణ స్థితి 30/290కి పడిపోయిందని, ప్రయోగానికి ముందు 30/320 ఉండేదని అన్నారు. అయితే.. కమిటీ నిర్ణయం అనంతరం రాకెట్‌ను డిస్మాంటిల్ చేసే అవకాశం ఉంటుందని.. మళ్లీ కొన్ని నెలల్లోనే తిరిగి నిర్మాణం చేసి ప్రయోగం చేపట్టవచ్చని ఆలోచిస్తున్నట్లు ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు.