చంద్రయాన్-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడంటే..?

| Edited By: Srinu

Jul 15, 2019 | 2:21 PM

చంద్రయాన్ 2 ప్రయోగం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని ప్లనిటరీ సొసైటీ ఫౌండర్ రఘునందన్ తెలిపారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది త్వరలోనే ప్రయోగాన్ని యధావిధిగా చేపడతామని చెప్పారు. లోపాలను ముందుగానే గుర్తించడం వల్ల భారీ నష్టం నుంచి బయటపడ్డామని అన్నారు. లేకపోయి ఉంటే ప్రయోగ వ్యయంతోపాటు విలువైన సమయం కూడా వృధా అయి వుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయోగాన్ని తిరిగి జరపాలంటే లోపాలను సరిదిద్దడంతో పాటు లాంచ్ విండో టైమ్‌ను కూడా అంచనా వేయగలగాలని చెప్పారు. గతంలో […]

చంద్రయాన్-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడంటే..?
Follow us on

చంద్రయాన్ 2 ప్రయోగం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని ప్లనిటరీ సొసైటీ ఫౌండర్ రఘునందన్ తెలిపారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది త్వరలోనే ప్రయోగాన్ని యధావిధిగా చేపడతామని చెప్పారు. లోపాలను ముందుగానే గుర్తించడం వల్ల భారీ నష్టం నుంచి బయటపడ్డామని అన్నారు. లేకపోయి ఉంటే ప్రయోగ వ్యయంతోపాటు విలువైన సమయం కూడా వృధా అయి వుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయోగాన్ని తిరిగి జరపాలంటే లోపాలను సరిదిద్దడంతో పాటు లాంచ్ విండో టైమ్‌ను కూడా అంచనా వేయగలగాలని చెప్పారు. గతంలో కూడా జీఎస్ఎల్వీ‌లో ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తిందని అన్నారు. అప్పట్లో కౌంట్ డౌన్ నిలిపివేసి తిరిగి విజయవంతంగా ప్రయోగించిన అనుభవం కూడా ఇస్రోకి ఉందన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా పడడం పై ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని రఘునందర్ చెప్పారు.