వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈజీ మనీ ట్రాన్స్ఫర్ కోసం ఆ నాలుగు బ్యాంకులతో ఒప్పందం

|

Dec 16, 2020 | 9:30 PM

వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ నాలుగు బ్యాంకులతో ఒప్పదం..

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈజీ మనీ ట్రాన్స్ఫర్ కోసం ఆ నాలుగు బ్యాంకులతో ఒప్పందం
Follow us on

WhatsApp Pay Service : వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ నాలుగు బ్యాంకులతో ఒప్పదం చేసుకుంది.

ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి ఉందని కంపెనీ ప్రకటించింది.

మెసెజ్‌లు ఎంత సురక్షితంగా పంపుతామో..  అంతే ఈజీగా డబ్బులను కూడా పంపించుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా డబ్బులను పంపవచ్చని సంస్థ తెలిపింది. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కృషి చేస్తున్నాం అని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు. 160కి పైగా బ్యాంకులకు వాట్సప్‌ పేమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. డిజిటల్ ఇండియాలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు.