మరో రెండు రోజులు.. వాతావరణ వివరాలు..

|

Aug 26, 2020 | 6:25 PM

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో ఉరుములు, మెరపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు...

మరో రెండు రోజులు.. వాతావరణ వివరాలు..
Follow us on

వాతావరణ శాఖ మరో వర్ష సూచనను మోసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రేపు (గురువారం) ఎల్లుండి (శుక్రవారం) పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో ఉరుములు, మెరపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలు చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి పరివాహక గ్రామాలు, లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి.