బ్రిటన్ ఎయిర్ పోర్టులో సడన్‌గా వర్షం… షాకైన ప్రయాణికులు!

| Edited By:

Aug 12, 2019 | 9:43 PM

లండన్‌లోని ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు… ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. కారణం… ఎయిర్‌పోర్ట్ భవనం లోపల ఉన్నట్టుండి కుండపోత వర్షం పడటమే. ఈ వర్షం వల్ల చాలా మంది ప్రయాణికులు తడిసిపోయారు. అసలే విమానాల రాక ఆలస్యమవుతోందని… చిరాకు పడుతున్న ప్రయాణికులకు… వర్షం పడటం మరో షాకింగ్ అంశం అయ్యింది. సీలింగ్ నుంచీ భారీ వర్షం పడటాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీశారు. వాటిలో ఓ వీడియో… సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నిజానికి ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ చాలా […]

బ్రిటన్ ఎయిర్ పోర్టులో సడన్‌గా వర్షం... షాకైన ప్రయాణికులు!
Follow us on

లండన్‌లోని ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు… ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. కారణం… ఎయిర్‌పోర్ట్ భవనం లోపల ఉన్నట్టుండి కుండపోత వర్షం పడటమే. ఈ వర్షం వల్ల చాలా మంది ప్రయాణికులు తడిసిపోయారు. అసలే విమానాల రాక ఆలస్యమవుతోందని… చిరాకు పడుతున్న ప్రయాణికులకు… వర్షం పడటం మరో షాకింగ్ అంశం అయ్యింది. సీలింగ్ నుంచీ భారీ వర్షం పడటాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీశారు. వాటిలో ఓ వీడియో… సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నిజానికి ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది. ప్రయాణికుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఐతే… కొన్ని రోజులుగా బ్రిటన్‌లో సడెన్ వానలు వస్తున్నాయి. వాటికి తోడు బలమైన ఈదురుగాలులు వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్ ఫ్లోర్‌కి లీకేజ్ అవ్వడంతో… వాన నీరు భారీగా లోపల పడింది. దాదాపు 15 నిమిషాలపాటూ వాన పడటంతో… చాలా మంది తడిసి ముద్దయ్యారు.