గోదావరికి వరద ఉధృతి.. ఆందోళనలో పలు గ్రామాల ప్రజలు

| Edited By:

Jul 30, 2019 | 11:46 AM

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లుతుంది. ఎగిసిపడతున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.3 అడుగుల నీటిమట్టం నమెదైంది. మరోవైపు 3.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు గోదావరి డెల్టాకు 4700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నదికి వరద నీరు వచ్చిచేరడంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లోని దేవీపట్నం మండలాల్లో దాదాపు 16 గ్రామాలు వరదముంపునకు గురయ్యే అవకాలున్నాయి. అయితే ఈ గ్రామాల […]

గోదావరికి వరద ఉధృతి.. ఆందోళనలో పలు గ్రామాల ప్రజలు
Follow us on

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లుతుంది. ఎగిసిపడతున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.3 అడుగుల నీటిమట్టం నమెదైంది. మరోవైపు 3.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు గోదావరి డెల్టాకు 4700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం గోదావరి నదికి వరద నీరు వచ్చిచేరడంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లోని దేవీపట్నం మండలాల్లో దాదాపు 16 గ్రామాలు వరదముంపునకు గురయ్యే అవకాలున్నాయి. అయితే ఈ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లును సిద్ధం చేశారు. ఇప్పటికే పూడిపల్లి వద్ద సీతపల్లి వద్ద వాగుకు గోదావరి పోటెత్తింది. ఇదిలా ఉంటే పలు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఇటువైపు వరద ఉధ‌ృతి తగ్గినా ప్రాజెక్టు అవతల వైపు ఉన్న దేవీపట్నం వంటి ప్రాంతాలు నీటమునిగే అవకాశమున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు.