కరోనా ఎఫెక్ట్..టాయిలెట్ పేపర్ కోసం మహిళల కొట్లాట..

|

Mar 08, 2020 | 4:39 PM

టాయిలెట్‌లో వినియోగించే టిష్యూ పేపర్ రోల్స్ కోసం హింసాత్మక ఘర్షణకు పాల్పడిన ఇద్దరు సిడ్నీ మహిళలపై ఆస్ట్రేలియా పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. సూపర్ మార్కెట్‌లో జరిగిన ఘర్షణను కొందరు వీడియోలలో నిక్షిప్తం చేయడంతో..ఆ ఫుటేజ్ ఆధారంగా 23 ఏళ్లు, 60 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలకు కోర్టు హాజరు నోటీసులు జారీ చేసినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. వారు ఏప్రిల్ 28న స్థానిక కోర్టులో హాజరుకానున్నారు. కరోనా వైరస్ మహమ్మారి […]

కరోనా ఎఫెక్ట్..టాయిలెట్ పేపర్ కోసం మహిళల కొట్లాట..
Follow us on

టాయిలెట్‌లో వినియోగించే టిష్యూ పేపర్ రోల్స్ కోసం హింసాత్మక ఘర్షణకు పాల్పడిన ఇద్దరు సిడ్నీ మహిళలపై ఆస్ట్రేలియా పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. సూపర్ మార్కెట్‌లో జరిగిన ఘర్షణను కొందరు వీడియోలలో నిక్షిప్తం చేయడంతో..ఆ ఫుటేజ్ ఆధారంగా 23 ఏళ్లు, 60 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలకు కోర్టు హాజరు నోటీసులు జారీ చేసినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. వారు ఏప్రిల్ 28న స్థానిక కోర్టులో హాజరుకానున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా..చైనా నుంచి దిగుమతి చేసుకునే టిష్యూ పేపర్స్ షార్టేజ్ అవుతోందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అంతేకాక ప్రజలు భయంతో 10 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను తీసుకెళ్లి..ఇంట్లో నుంచి బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు టాయిలెట్ పేపర్స్ కోసం ఈ విధంగా ఎగబడుతున్నారు. కాగా ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 కి చేరుకుంది.