ముంబైలో వర్షాల ఎఫెక్ట్..రన్‌వేపై చేపల ‘జలకాలాట’

|

Jul 03, 2019 | 4:11 PM

ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.  భారీ వర్షాల వల్ల ముంబయి నగరం చాలా వరకు ముంపునకు గురైంది. వర్షాల ప్రభావం వల్ల రైల్వే ట్రాక్‌లు, విమానాశ్రయాల రన్‌వేలు సైతం నీట మునిగాయి. దీంతో రైళ్లు, విమానాల రాకపోలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. చాలా వరకు సర్వీసులు రద్దయ్యాయి. ముంపు ప్రాంతంలో గల జుహూ విమానాశ్రయం కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విమానాశ్రయం సమీపంలోని గుంటల్లో ఉండే చేపలు ఆ నీటితో కలిసి రన్‌వే […]

ముంబైలో వర్షాల ఎఫెక్ట్..రన్‌వేపై చేపల జలకాలాట
Follow us on

ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.  భారీ వర్షాల వల్ల ముంబయి నగరం చాలా వరకు ముంపునకు గురైంది. వర్షాల ప్రభావం వల్ల రైల్వే ట్రాక్‌లు, విమానాశ్రయాల రన్‌వేలు సైతం నీట మునిగాయి. దీంతో రైళ్లు, విమానాల రాకపోలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. చాలా వరకు సర్వీసులు రద్దయ్యాయి. ముంపు ప్రాంతంలో గల జుహూ విమానాశ్రయం కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విమానాశ్రయం సమీపంలోని గుంటల్లో ఉండే చేపలు ఆ నీటితో కలిసి రన్‌వే పైకి చేరుకున్నాయి. విమానాల రాకపోకల కోసం రన్‌వేను తనిఖీ చేసే సిబ్బంది ఈ చేపలను చూసి ఆశ్చర్యపోయారు. వాటి వల్ల విమానాలకు ప్రమాదం ఏర్పడుకుండా వాటిని డ్రమ్ముల్లో వేసి తరలించారు. ఈ చేప ఒక్కోక్కటీ రెండు నుంచి మూడు అడుగుల పొడవు ఉండటం గమనార్హం.