Warangal CP: భూ తగాదాలో జంగా రాఘవరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు… సీపీ ప్రమోద్ కుమార్…

| Edited By:

Jan 03, 2021 | 5:42 AM

‘‘భూ తగాదాలో జంగా రాఘవరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. కచ్చితమైన ఆరోపణలతోనే జంగా రాఘవరెడ్డిని అరెస్ట్ చేశాం’’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ప్రమోద్ కుమార్ అన్నారు.

Warangal CP: భూ తగాదాలో జంగా రాఘవరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు... సీపీ ప్రమోద్ కుమార్...
Follow us on

‘‘భూ తగాదాలో జంగా రాఘవరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. కచ్చితమైన ఆరోపణలతోనే జంగా రాఘవరెడ్డిని అరెస్ట్ చేశాం’’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ప్రమోద్ కుమార్ అన్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ నేతల పర్యటన, పోలీసులపై ఆరోపణల నేపథ్యంలో సీపీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జనగాం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడంతోనే అతనిపై కేసు నమోదు చేశామని వివరించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఓ నేరస్తుడి కోసం పోలీసులపై అసత్య ప్రచారం సరికాదని హితవు పలికారు. భూ కబ్జాలు, కిడ్నాప్‌లకు పాల్పడితే ఎవరినైనా వదిలిపెట్టమని హెచ్చరించారు.

 

Also Read: రౌడీ షీటర్.. పది హత్యకేసులలో నిందితుడు, అలాంటి వ్యక్తికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శా..! గులాబీనేతల స్ట్రాంగ్ కౌంటర్