హాట్‌హాట్‌గా అసెంబ్లీ.. చంద్రబాబు వర్సెస్ స్పీకర్…

| Edited By:

Dec 11, 2019 | 12:29 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్న విధంగా సభలో చర్చకొనసాగింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌పై చంద్రబాబు పరుష పదజాలం ఉపయోగించారు. మేం మాట్లాడితే అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్పీకర్‌కు మార్యాదగా ఉండదంటూ చంద్రబాబు అన్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ చంద్రబాబుపై […]

హాట్‌హాట్‌గా అసెంబ్లీ.. చంద్రబాబు వర్సెస్ స్పీకర్...
Follow us on

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్న విధంగా సభలో చర్చకొనసాగింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌పై చంద్రబాబు పరుష పదజాలం ఉపయోగించారు.

మేం మాట్లాడితే అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్పీకర్‌కు మార్యాదగా ఉండదంటూ చంద్రబాబు అన్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. స్పీకర్ చైర్‌ను మీరు అవమానించారంటూ మండిపడ్డారు. ‘మీ మీద నాకు గౌరవం ఉంది. కానీ ఇష్టానుసారం స్పీకర్‌పై ఆరోపణలు చేస్తే మంచిది కాదంటూ చంద్రబాబును హెచ్చిరంచారు స్పీకర్. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభమని.. స్పీకర్‌ చైర్‌ను ఏమాత్రం గౌరవించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. మరోవైపు స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు.