త‌న ప్ర‌శ్న‌తో యూనిసెఫ్​నే మెప్పించిన‌ విశాఖ చిన్నోడు..

|

May 26, 2020 | 3:56 PM

క‌రోనావైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని ష‌ట్ డౌన్ చేసి ప‌డేసింది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌పంచ ఆర్థిక రంగం తీవ్ర స్థాయిలో దెబ్బ‌తింది. దాదాపు అన్ని రంగాలు ఎంతోకొంత దెబ్బ‌తిన్నాయి. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ పై చిన్నారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. కరోనా ప్రభావాన్ని పిల్లలు అర్థం చేసుకునే విధంగా కార్యక్రమాలకు రూప‌క‌ల్ప‌న చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది చిన్నారుల‌కు క‌రోనావైర‌స్ పై […]

త‌న ప్ర‌శ్న‌తో యూనిసెఫ్​నే మెప్పించిన‌ విశాఖ చిన్నోడు..
Follow us on

క‌రోనావైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని ష‌ట్ డౌన్ చేసి ప‌డేసింది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌పంచ ఆర్థిక రంగం తీవ్ర స్థాయిలో దెబ్బ‌తింది. దాదాపు అన్ని రంగాలు ఎంతోకొంత దెబ్బ‌తిన్నాయి. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ పై చిన్నారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. కరోనా ప్రభావాన్ని పిల్లలు అర్థం చేసుకునే విధంగా కార్యక్రమాలకు రూప‌క‌ల్ప‌న చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది చిన్నారుల‌కు క‌రోనావైర‌స్ పై ప్రశ్నలు సంధించే అవకాశాన్ని కల్పించింది. వీరిలో ఐదుగురు పిల్లల నుంచి వచ్చిన ధీటైన‌ ప్రశ్నలకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఆన్స‌ర్స్ ఇచ్చారు. అందులో ఆసియా ఖండం నుంచి ఒకే ఒక క్వ‌చ్చ‌న్ ఎంపికైంది. విశాఖకు చెందిన జై రిషిక్ అడిగిన ఆ ప్రశ్నకు యూనిసెఫ్ ఆన్స‌ర్ ఇచ్చింది. కరోనా మహమ్మారి వీర‌విహారం చేస్తోన్న స‌మ‌యంలో ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్న విష‌యాన్ని గుర్తు చేసిన‌ జై రిషిక్ … ఆర్థిక ఇబ్బందుల‌ కారణంగా ఆయా కుటుంబాల్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఉన్న‌ ఫుడ్ దొరికే అవకాశం ఉండదనే విషయాన్ని ప్రస్తావించాడు. అత్యంత క్లిష్ట‌మైన ఈ సమస్యను అధిగమించి పిల్లలకు పౌష్టికాహారం అందించే దిశగా యూనిసెఫ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంద‌ని జై రిషిక్ ప్ర‌శ్నించాడు. కొవిడ్ కారణంగా అనేక స్కూల్స్ మూసివేశార‌ని, కోట్లాది మంది చిన్నారులు కనీసం మధ్యాహ్న భోజన పథకాలకు సైతం అందుకోలేని పరిస్థితి ఉందని యూనిసెఫ్ ప్రతినిధి అన్నారు. ఇది ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా అభిప్రాయ‌ప‌డ్డ ఆయ‌న‌… అధిగమించేందుకు యూనిసెఫ్ అన్ని విధాలా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు.

క‌రోనాపై పిల్ల‌ల్లో అవ‌గాహ‌న అవ‌స‌రం

కరోనాపై పిల్లల్లో అవగాహన పెంపొందించడం చాలా అవసరమని రిషిక్ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు సంక్షోభాలు వ‌చ్చిన‌‌ప్పుడు… పరస్పర సహకారం అందించుకునే మనస్తత్వం, వివిధ వర్గాల్లో నెలకొన్న సమస్యల గురించి తెలుసుకోవ‌డం ద్వారా వాటి‌ని అధిగమించడంలో ముందుంటార‌ని చెబుతున్నారు.