వైజాగ్ గ్యాస్ లీకేజీ: వామ్మో.. స్టెరీన్‌ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్‌లా..!

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 12:04 PM

రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసులతో ఇప్పటికే పోరాటం చేస్తోన్న ఏపీకి మరో కష్టమొచ్చిపడింది. వైజాగ్‌లోని గోపాలపట్నం పరిధి, ఆర్ఆర్ వెంకటాపురంలోని

వైజాగ్ గ్యాస్ లీకేజీ: వామ్మో.. స్టెరీన్‌ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్‌లా..!
Follow us on

రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసులతో ఇప్పటికే పోరాటం చేస్తోన్న ఏపీకి మరో కష్టమొచ్చిపడింది. వైజాగ్‌లోని గోపాలపట్నం పరిధి, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో స్టెరీన్‌ వాయువు లీక్ అవ్వడంతో.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేలాది మూగ జీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. కాగా స్టెరీన్‌ ప్రభావం దీర్ఘకాలికంగా పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాస్‌ పీల్చడం వలన కేంద్ర నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూసే అవకాశం ఉంది. దాంతో పాటు కిడ్నీ సంబంధ వ్యాధులు, తలనొప్పి, మానసిక రుగ్మత, అలసట, నీరసం, వినికిడి లోపం, క్యాన్సర్, ఏకాగ్రత సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైజాగ్ గ్యాస్‌ ప్రమాదంపై దేశవ్యాప్తంగా పలువురు స్పందిస్తున్నారు. ఈ ఘటన తమను ఎంతో బాధించిందని మోదీ, నిర్మలా సీతారామన్, కేజ్రీవాల్, వెంకయ్యనాయుడు, కేటీఆర్, కవిత, చిరంజీవి తదితరులు సోషల్ మీడియాలో తెలిపారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

Read This Story Also: బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌