ఇక వరంగల్‌లో కరోనా ల్యాబ్‌..

| Edited By:

Apr 17, 2020 | 7:08 PM

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షల నిర్వహణకు వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో నూతన వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభమైంది. రూ. 1.70 కోట్ల వ్యయంతో

ఇక వరంగల్‌లో కరోనా ల్యాబ్‌..
Follow us on

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షల నిర్వహణకు వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో నూతన వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభమైంది. రూ. 1.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కరోనా పరీక్షలను ఇక్కడ నిర్వహించనున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ల్యాబ్‌తో ఇక్కడ రోజుకు 100 వరకు కరోనా పరీక్షలు చేసేందుకు వీలు కలిగింది.

కాగా.. కరోనాతో పాటుగా ఇతర వైరస్‌లకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ సమయంలో పేదలెవరూ పస్తులుండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందన్నారు.