శభాష్ కలెక్టరమ్మా..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2019 | 2:37 PM

రోజువారి కూలి పనులు చేసుకుని బతికేవారు కూడ తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తిండి తినక పోయిన అప్పో సప్పో చేసి తమ పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నారు. గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖనమ్ అయేషా తన కుమార్తెను గురుకుల పాఠశాలలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గతంలో అయేషా కుమార్తె […]

శభాష్ కలెక్టరమ్మా..!
Follow us on

రోజువారి కూలి పనులు చేసుకుని బతికేవారు కూడ తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తిండి తినక పోయిన అప్పో సప్పో చేసి తమ పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నారు. గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖనమ్ అయేషా తన కుమార్తెను గురుకుల పాఠశాలలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గతంలో అయేషా కుమార్తె సబీష్ రాణియా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదివింది. ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని భావించిన కలెక్టరమ్మ తన కూతుర్ని గురుకుల పాఠశాలలో డేస్కాలర్ గా చేర్పించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు.