“ఈ రూల్ కి అంగీకరిస్తే.. మీ ఇంట్లో పెళ్లికి ప‌ర్మిష‌న్ “

|

Apr 11, 2020 | 8:21 AM

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌మంతా లాక్ డౌన్ విధించ‌డంతో ప్రజలంతా దాదాపు ఇళ్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. ప్ర‌భుత్వాల ఆదేశాల ప్ర‌కారం అన్ని ర‌కాల‌ శుభ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం ముందే మంచి ముహుర్తాలు పెట్టుకుని.. ఇప్పుడు పెళ్లిళ్లు ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారికి విజయవాడ సీపీ.. ఓ అవకాశాన్ని కల్పించారు. క‌రోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వివాహ కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిద‌ని విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు […]

ఈ రూల్ కి అంగీకరిస్తే.. మీ ఇంట్లో పెళ్లికి  ప‌ర్మిష‌న్
Follow us on

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌మంతా లాక్ డౌన్ విధించ‌డంతో ప్రజలంతా దాదాపు ఇళ్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. ప్ర‌భుత్వాల ఆదేశాల ప్ర‌కారం అన్ని ర‌కాల‌ శుభ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం ముందే మంచి ముహుర్తాలు పెట్టుకుని.. ఇప్పుడు పెళ్లిళ్లు ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారికి విజయవాడ సీపీ.. ఓ అవకాశాన్ని కల్పించారు.

క‌రోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వివాహ కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిద‌ని విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు సూచించారు. అయితే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఓ నిబంధనకు అంగీకరిస్తే మాత్రం.. ప‌ర్మిష‌న్ ఇస్తామని కాస్త వెసులుబాటు కల్పించారు. విజయవాడ పరిధిలో జరిగే పెళ్లికి కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరవుతామని లేఖ ద్వారా .. పోలీస్ డిపార్ట్ మెంట్ కు ద‌రఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ మంది వస్తే మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు.