Venky voice over to Krack: మాస్ మహారాజాకు మాట సాయం చేయనున్న వెంకీ.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణ..

|

Dec 31, 2020 | 9:09 PM

Venky Giving voice over to Krack: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజాకు కచ్చితంగా హిట్ అవసరమైన సందర్భంలో..

Venky voice over to Krack: మాస్ మహారాజాకు మాట సాయం చేయనున్న వెంకీ.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణ..
Follow us on

Venky Giving voice over to Krack: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజాకు కచ్చితంగా హిట్ అవసరమైన సందర్భంలో వస్తోన్న సినిమా కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈ చిత్రాన్ని వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తుండడం కూడా అంచనాలు ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై పాజిటివ్ టాక్‌ను తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వాయిర్ ఓవర్ ఇవ్వనున్నడనేది ఆ వార్త సారాంశం. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. మరి వెంకీ అయినా.. రవితేజాకు హిట్ అందిస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే న్యూఇయర్ కానుకగా శుక్రవారం ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

Also Read: krack : పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో క్రాక్ మూవీ.. డబ్బింగ్ మొదలుపెట్టిన మాస్ రాజా..