Secretariat : ప్రపంచమే ఆశ్చర్యపడేలా తెలంగాణ నూతన సచివాలయం… మంత్రి ప్రశాంత్ రెడ్డి..

| Edited By:

Jan 03, 2021 | 5:46 AM

ప్రపంచమే ఆశ్చర్యపడేలా తెలంగాణ నూతన సచివాలయం ఉంటుందని రాష్ట్ర రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

Secretariat : ప్రపంచమే ఆశ్చర్యపడేలా తెలంగాణ నూతన సచివాలయం... మంత్రి ప్రశాంత్ రెడ్డి..
Vemula Prashanth reddy
Follow us on

ప్రపంచమే ఆశ్చర్యపడేలా తెలంగాణ నూతన సచివాలయం ఉంటుందని రాష్ట్ర రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. పనుల వేగవంతంపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న 2,500 మంది కార్మికుల వసతి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన పరిశుభ్రమైన వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మాణం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, ఐఐటీ ఫ్రొఫెసర్స్ సహాయంతో నూతన సచివాలయ నమూనా రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు, ప్రధాన భవనం నిర్మాణం కోసం గుంతల తవ్వకం, సిమెంట్, స్టీల్ వినియోగం వంటి అంశాలను వివరించారు. 12 నెలల్లో సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

 

Also Read: టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం: రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారన్న మంత్రి ఎర్రబెల్లి