హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా…

|

Nov 06, 2020 | 4:01 PM

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ రకం చూసినా ఇంచుమించుగా కేజీ 50 రూపాయలకు అటూ ఇటుగా ఉన్నాయి. బెండకాయ, వంకాయ, సొరకాయ, టమాటా ఏదైనా సరే..ఒక కేజీ తీసుకుని రూ. 60 నోటిస్తే తిరిగి చిల్లర వెనక్కి రావడం లేదు. 

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా...
Follow us on

Vegetable prices : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ రకం చూసినా ఇంచుమించుగా కేజీ 50 రూపాయలకు అటూ ఇటుగా ఉన్నాయి. బెండకాయ, వంకాయ, సొరకాయ, టమాటా ఏదైనా సరే..ఒక కేజీ తీసుకుని రూ. 60 నోటిస్తే తిరిగి చిల్లర వెనక్కి రావడం లేదు.  ఉల్లి కొనాలంటే కన్నీరు పెట్టిస్తుంది. వర్షాలు, వరదల ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఈ ధరలు మరీ చుక్కలు చూపిస్తున్నాయి.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్‌ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్‌లతో పాటు గ్రేటర్‌ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి.