సెలబ్రిటీల లైఫ్ లో ఇద్దరినీ ప్రేమించడం, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందిని పెళ్ళిచేసుకోవడం చాలా కామన్‌గా జరుగుతుంటాయి. ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపింది, ముగ్గురిని పెళ్ళాడింది. తాజాగా మరోసారి ప్రేమలో పడిందట. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కాదు వనిత విజయ్ కుమార్. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మూడో భర్తకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా వనిత విజయ్ కుమార్ ప్రేమలో పడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. మళ్ళీ ప్రేమలో పడ్డాను ఇప్పుడు మీరు హ్యాపీనా.. అంటూ పోస్ట్ పెట్టింది వనిత. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక 2000సంవత్సరంలో నటుడు ఆకాష్ ను వనిత వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు జన్మనించిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. ఆయనతో ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్ తో నాలుగేళ్ళు ప్రేమాయణం సాగించింది. ఆ తరవాత 2017లో అతడితో విడిపోయింది. మరి ఇప్పుడు వనిత ఎవరిప్రేమలో పడిందో చూడాలి.