శ్రీవారి దర్శనం చేసుకుంటేనే ఉచిత లడ్డూ..!

|

Jan 05, 2020 | 7:18 PM

తిరుమలలో ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠద్వార దర్శనంపై టీటీడీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు జరిగిన బోర్డు అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలోలా కేవలం ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పాటు కల్పించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై వెంటనే బోర్డు మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు టీటీడీని ఆదేశించింది. దీంతో నేడు(జనవరి 5) […]

శ్రీవారి దర్శనం చేసుకుంటేనే ఉచిత లడ్డూ..!
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us on

తిరుమలలో ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠద్వార దర్శనంపై టీటీడీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు జరిగిన బోర్డు అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలోలా కేవలం ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పాటు కల్పించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై వెంటనే బోర్డు మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు టీటీడీని ఆదేశించింది. దీంతో నేడు(జనవరి 5) ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఇక ఉచిత లడ్డూ విషయంపైన కూడా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతను ఇచ్చారు. జనవరి 20 నుంచి శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూను ఇవ్వబోతున్నట్టు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారికే లడ్డూ అందిస్తామని..రూ. 50 కి అదనపు లడ్డూ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.