ఉత్తరఖండ్ జలప్రళయం.. 62కి పెరిగిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

|

Feb 20, 2021 | 1:40 AM

Uttarakhand Floods: మంచుచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌‌లోని చమోలి జిల్లాలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ధౌలీగంగా వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 13 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్..

ఉత్తరఖండ్ జలప్రళయం.. 62కి పెరిగిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Follow us on

Uttarakhand Floods: మంచుచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌‌లోని చమోలి జిల్లాలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ధౌలీగంగా వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 13 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 62కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా గల్లంతైన 142 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 62 మృతదేహాల్లో 33 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుర్తించని 29 మృతదేహాల డీఎన్‌ఏలను భద్రపరుస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 7న సంభవించిన వరదల అనంతరం తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు గల్లంతైన వారికోసం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతమంతా బురద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. తాజాగా ఈ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Also Read:

India – China Border Standoff: తూర్పు లడఖ్‌లో పూర్త‌యిన భారత్ – చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌..

Pragya Singh Thakur: అనారోగ్యంతో మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. నిలకడగా ఆరోగ్యం..