దూసుకువస్తున్న రాకాసి మిడతలు.. అప్రమత్తమైన అధికారులు..!

| Edited By:

May 24, 2020 | 6:05 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు మిడతల రూపంలో ప్రమాదం ముంచుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల

దూసుకువస్తున్న రాకాసి మిడతలు.. అప్రమత్తమైన అధికారులు..!
Follow us on

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు మిడతల రూపంలో ప్రమాదం ముంచుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల దండు ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకు వస్తున్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని దౌసా జిల్లా వరకు చేరుకున్నాయి.

వివరాల్లోకెళితే.. ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతల గుంపు గాలి వ్యతిరేక దిశలో వీస్తుండడంతో చెల్లాచెదురయ్యాయి. దాంతో కొన్ని మధ్యప్రదేశ్ దిశగా వెళ్లాయి. ఈ రాకాసి మిడతలు ఆగ్రా సహా యూపీలో 17 జిల్లాలపై పెను ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. దాంతో, 204 ట్రాక్టర్లను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ద్వారా మిడతలపై రసాయనాలు పిచికారీ చేయాలని నిర్ణయించింది.

కాగా.. త్వరలో రాకాసి మిడతల ప్రభావం యూపీపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు ఒక్కసారి పంట పొలంపై వాలాయంటే అక్కడ చూడ్డానికి ఏమీ మిగలదు. తమ పదునైన దవడలు, కాళ్లకు ఉన్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!