Goa Elections: కీలక పరిణామం.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన ఉత్పల్ పారికర్.. కారణం అదేనా..

|

Mar 10, 2022 | 1:13 PM

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Goa Assembly Election Results) కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి నిలిచిన దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌....

Goa Elections: కీలక పరిణామం.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన ఉత్పల్ పారికర్.. కారణం అదేనా..
Utpal Parikar
Follow us on

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Goa Assembly Election Results) కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి నిలిచిన దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌(Utpal Parikar).. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆయన ఆశించినంతగా ఓట్లు రాకపోవడటంతో నిరాశలో ఉండిపోయారు. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ మంచి ఓట్లు సాధించాను. కానీ ఫలితం నిరాశపరిచిందని ఉత్పల్.. తన అభిప్రాయాన్ని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. తాను విలువల కోసం నిలబడే సమయం వచ్చిందని, రాజకీయ భవిష్యత్తును పనాజీ(Panaji) ప్రజలు నిర్ణయిస్తారని గతంలో ఉత్పల్ వ్యాఖ్యానించారు. గోవాలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ఒకరైన మనోహర్ పారికర్.. మరణించే వరకూ 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

తండ్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత పనాజీ ఉప-ఎన్నికల్లో పోటీకి ఉత్పల్ సముఖత వ్యక్తం చేసినా.. బీజేపీ మాత్రం వెనక్కు తగ్గించింది. పారికర్ అనుయాయుడు సిద్ధార్థ్ కున్‌కోయిలైకర్‌ను పోటీకి దింపింది. కానీ, అనూహ్యంగా ఈ ఉప-ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అటానాసియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత బీజేపీకి తొలి ఓటమి ఎదురైంది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అటాసియో.. 2019 జులైలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పార్టీ మారారు. బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తమ పార్టీలోకి రావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఆప్ పార్టీలో చేరితే పనాజీ నుంచి ఆప్ అభ్యర్థిగా నిలబెడతామని హామీ ఇవ్వడం విశేషం.

Also Read

Blackmail: న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌… మాయలేడి వలలో పడి లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. వీడియో

India Corona: తగ్గుతున్న కరోనా.. రెండేళ్ల కనిష్ఠానికి మహమ్మారి వ్యాప్తి.. శరవేగంగా వ్యాక్సినేషన్

Assembly Election Results 2022: ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షాక్‌.. ఓట్ల లెక్కింపులో వెనుకంజ