Biden: నాలుగు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం… జనవరి 1 నుంచి పోరాటమే… జో బైడెన్…

| Edited By: Pardhasaradhi Peri

Dec 29, 2020 | 7:09 AM

అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. అమెరికా ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని అందులో పేర్కొన్నారు.

Biden: నాలుగు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం... జనవరి 1 నుంచి పోరాటమే... జో బైడెన్...
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ ట్వీట్ చేశారు. అమెరికా ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. వాటిని అధిగమించేందుకు తన బృందం శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ పతనం, పర్యావరణ మార్పులు, జాతివివక్ష రూపంలో అమెరికా ఒకేసారి నాలుగు సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. జనవరి మొదటి రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించేందుకు తాను, తన బృందం శ్రమించనుందని ట్వీ్ట్ చేశారు.

ఆ ట్వీట్ ఇదే…