మరో ముందడుగు వేయాలి, భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, భద్రతలో సహకారం,యూఎస్ దౌత్య ప్రతినిధి ఆకాంక్ష

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 5:39 PM

భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారం పెంపొందాలని ఇండియాలో అమెరికా దౌత్య ప్రతినిధి కెన్ జస్టర్ అన్నారు.రెండు  దేశాల

మరో ముందడుగు వేయాలి, భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, భద్రతలో సహకారం,యూఎస్ దౌత్య ప్రతినిధి ఆకాంక్ష
Follow us on

భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారం పెంపొందాలని ఇండియాలో అమెరికా దౌత్య ప్రతినిధి కెన్ జస్టర్ అన్నారు.రెండు  దేశాల సరిహద్దులు, పరిమితులకు మించి భద్రతను కల్పించేందుకు, పెరుగుతున్న ముప్పు నుంచి రెండు దేశాలను రక్షించుకునేందుకు ఈ సహకారాన్ని ఈ నాలుగేళ్లలో పెంచుకున్నామని, ఇది ఇంకా పెంపొందాలని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్, కౌంటర్  టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్ మెంట్, అగ్రికల్చర్..ఇలా వివిధ రంగాల్లో గత రెండు దశాబ్దాల్లో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతూ వచ్చిందని, ఇది ముదావహమని కెన్ జస్టర్ పేర్కొన్నారు.

ఇప్పటికే భారత, అమెరికా దేశాలు రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఆసక్తి చూపుతున్నాయి. సౌత్ చైనా సీ లో చైనా పెత్తనాన్ని నియంత్రించేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో అమెరికా భారత సహకారాన్ని కోరుతోంది. ఈ  నేపథ్యంలో జస్టర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

AlsoRead:

పేర్ల మార్పుపై తెరపైకి కొత్త డిమాండ్లు, మహారాష్ట్ర అఘాడీ ప్రభుత్వంలో లుకలుకలు, సేన, కాంగ్రెస్ దేనిదారి దానిదే

ఒక్కొక్కరుగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కేబినెట్ నుంచి క్రీడామంత్రి రాజీనామా, బీజేపీ వైపు చూపా?

Postman Built Pebble Palace: గులకరాళ్ళతో అద్భుత కోట.. ఓ పోస్ట్ మాన్ క్రియేటివిటీకి అందరూ ఫిదా..!