‘టెన్త్’ టాపర్లకు యూపీ సీఎం బంపర్‌ ఆఫర్‌..

| Edited By:

Jun 29, 2020 | 12:05 AM

టెన్త్, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో టాప్‌ మెరిట్‌ సాధించిన 10 మంది విద్యార్థుల ఇళ్ల వరకు రోడ్లు నిర్మిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన చేసిన మొదటి రాష్ట్రం

టెన్త్ టాపర్లకు యూపీ సీఎం బంపర్‌ ఆఫర్‌..
Follow us on

UP to build roads: టెన్త్, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో టాప్‌ మెరిట్‌ సాధించిన 10 మంది విద్యార్థుల ఇళ్ల వరకు రోడ్లు నిర్మిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన చేసిన మొదటి రాష్ట్రం యూపీనే కావడం విశేషం. యూపీ డిప్యూటీ మినిస్టర్‌ దినేశ్‌ శర్మ శనివారం పది, ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సూచన ప్రకారం మెరిట్‌ సాధించిన 10 మంది విద్యార్థులకు రూ.లక్ష నగదు, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు రోడ్డు సౌకర్యం లేని విద్యార్థుల ఇంటి వరకు రోడ్లు నిర్మించనున్నా’మని ప్రకటించారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కూడా.. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు యూపీ సీఎం యోగి అభినందనలు తెలిపారు. ఇంటర్‌, పదో తరగతి ఫలితాలు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయన్నారు. జూలై 1 నుంచి విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నాం అని సీఎం పేర్కొన్నారు.