తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ అనుభవ లోపం… ఏమయ్యిందో చూడండి!

|

Oct 10, 2019 | 5:32 AM

నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రఘుపతి పేట్ దుందుభి వాగు ప్రవేట్ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి – కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఒక పక్క తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లతో బస్సులను నడుపుతున్న ఘటనల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమ్మెపై […]

తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ అనుభవ లోపం... ఏమయ్యిందో చూడండి!
Follow us on

నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రఘుపతి పేట్ దుందుభి వాగు ప్రవేట్ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి – కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఒక పక్క తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లతో బస్సులను నడుపుతున్న ఘటనల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమ్మెపై ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుభవం లేని డ్రైవర్ల వల్ల ఇటువంటి సమస్యలు తప్పవని..త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సరైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేని పరిస్థితుల్లో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.