స్టార్స్ ప్రాజెక్టుతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

| Edited By: Pardhasaradhi Peri

Oct 14, 2020 | 6:18 PM

బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, యూటీ(కేంద్రపాలిత ప్రాంతాలు) లకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

స్టార్స్ ప్రాజెక్టుతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Cabinet
Follow us on

బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, యూటీ(కేంద్రపాలిత ప్రాంతాలు) లకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.కేబినెట్ భేటీ అనంత‌రం కేంద్రమంత్రి ప్ర‌కాశ్‌జ‌వ‌దేక‌ర్ ఈ విషయాలను వెల్ల‌డించారు.

రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రభుత్వం పొందనుంది. దీన్‌ద‌యాల్ అంత్యోద‌య యోజ‌న నేష‌న‌ల్ రూర‌ల్ లైవ్లీహుడ్స్ మిష‌న్ కింద ఈ ప్యాకేజీని అందిస్తున్నారు. విద్యా సంబంధిత పథకం స్టార్ట్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి) ఆధ్వర్యంలోని ఛత్తీస్‌గడ్‌లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ డీమెజర్ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటుందని.. ఇది దాదాపు 90 శాతం పూర్తయింది. త్వరలోనే ఇది ప్రత్యేక సంస్థగా నమోదు చేయబడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.