యూనియన్ బ్యాంకులను డంప్ యార్డులుగా మార్చేశారు..! కారణం, ‘జగనన్నతోడు’, ‘ వైఎస్ఆర్ చేయూత’ ఇవ్వలేదనట.!

|

Dec 24, 2020 | 3:49 PM

గుమ్మంముందు చెత్తకుప్పలతో దర్శనమిస్తున్న ఇవి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం, వుయ్యూరు లోని యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్ లు...

యూనియన్ బ్యాంకులను డంప్ యార్డులుగా మార్చేశారు..! కారణం,  జగనన్నతోడు,  వైఎస్ఆర్ చేయూత ఇవ్వలేదనట.!
Follow us on

గుమ్మంముందు చెత్తకుప్పలతో దర్శనమిస్తున్న ఇవి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం, వుయ్యూరు లోని యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్ లు. ఈ ఏడాదే ఆంధ్రా బ్యాంక్‌ను ఇందులో విలీనం చేశారనుకోండి అదివేరే సంగతి. అసలు మ్యాటరేంటంటే. ఈ బ్యాంకు ముందున్న రోడ్డు మీద, బ్యాంకుల గుమ్మం ముందు కూడా నగరంలోని చెత్తంతా తెచ్చి డంప్ చేశారు. ఏంటిది, ఎందుకిలా.! అనుకుంటున్నారా? బ్యాంకు సిబ్బంది పనితనానికి చిరాకెత్తిన జనం ఇంతపనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తెచ్చిన ‘జగనన్న తోడు’, ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాలకు సంబంధించి లోన్లు ఇవ్వడం లేదని ఇలా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలానే బ్యాంకుల ముందు చెత్తపోశారు. అయితే, ఎలాగోలా దారి చేసుకుని విధులకు హాజరయ్యారు బ్యాంకు సిబ్బంది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు.. లోన్లు ఇవ్వకుంటే చెత్త పోస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని ఆదేశించారు. దీంతో చెత్తను తొలగించారు మున్సిపల్ కార్మికులు.