కనుమరుగవ్వనున్న ‘ఆంధ్రాబ్యాంకు’

|

Aug 30, 2019 | 7:56 PM

డౌన్ ఫాల్‌లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్దం చేసింది. బ్యాంకింగ్ రంగంలో కీలక ప్రక్షాణళలను తీసుకురాబోతుంది.  ఐదు ట్రిలియన్‌ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడమే లక్ష్యంగా… ప్రస్తుతమున్న 27 బ్యాంకులను విలీనం చేసి 12 బ్యాంకుల ద్వారా సేవలందించనున్నారు. విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐలు కలిసి ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయి. ఆంధ్రా బ్యాంకును 1923, నవంబరు 20న ఫ్రీడమ్ ఫైటర్  భోగరాజు పట్టాభి సీతారామయ్య […]

కనుమరుగవ్వనున్న ఆంధ్రాబ్యాంకు
Union Bank, Andhra Bank, Corporation Bank to merge to become 5th largest bank PSB
Follow us on

డౌన్ ఫాల్‌లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్దం చేసింది. బ్యాంకింగ్ రంగంలో కీలక ప్రక్షాణళలను తీసుకురాబోతుంది.  ఐదు ట్రిలియన్‌ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడమే లక్ష్యంగా… ప్రస్తుతమున్న 27 బ్యాంకులను విలీనం చేసి 12 బ్యాంకుల ద్వారా సేవలందించనున్నారు. విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐలు కలిసి ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయి. ఆంధ్రా బ్యాంకును 1923, నవంబరు 20న ఫ్రీడమ్ ఫైటర్  భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు.

1980లో ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బ్యాంకును జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేయడంతో దేశంలో ఆంధ్రా బ్యాంకు పేర మారుమోగిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టడంలోనూ ఆంధ్రాబ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు లోన్లు, సదుపాయాల, అవసరాల విషయంలో ఎనలేని సేవ చేేసిన ఆంధ్రా బ్యాంక్ ఇకపై కనుమరుగుకానుంది.