పట్టణ భారతీయుల్లో నిరుద్యోగంపై తీవ్ర ఆందోళన

| Edited By:

Dec 29, 2019 | 4:51 AM

పట్టణ భారతీయుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుండగా, వారిలో 69 శాతం మంది దేశం సరైన దిశలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారని ఒక సర్వేలో తేలింది. ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానత, వాతావరణ మార్పు భారతీయులను ఆందోళనకు గురిచేసే ముఖ్య సమస్యలుగా సర్వే సంస్థ ఇప్సోస్ పేర్కొంది. వాట్ వర్రీస్ ది వరల్డ్ అనే అంశంపై ఈ సంస్థ పరిశోధనలు చేపట్టింది. తమ దేశం తప్పు మార్గంలో […]

పట్టణ భారతీయుల్లో నిరుద్యోగంపై తీవ్ర ఆందోళన
Follow us on

పట్టణ భారతీయుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుండగా, వారిలో 69 శాతం మంది దేశం సరైన దిశలో పయనిస్తున్నట్లు పేర్కొన్నారని ఒక సర్వేలో తేలింది. ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానత, వాతావరణ మార్పు భారతీయులను ఆందోళనకు గురిచేసే ముఖ్య సమస్యలుగా సర్వే సంస్థ ఇప్సోస్ పేర్కొంది. వాట్ వర్రీస్ ది వరల్డ్ అనే అంశంపై ఈ సంస్థ పరిశోధనలు చేపట్టింది. తమ దేశం తప్పు మార్గంలో ఉందని భావించే 61 శాతం ప్రపంచ పౌరులతో పోలిస్తే, భారతదేశం ఆశావాద దృక్పథంతో ఉందని సర్వేలో తేలింది.

పట్టణ భారతీయులలో నిరుద్యోగం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఇది అక్టోబర్ తో పోలిస్తే 3% పెరిగింది. అని సర్వే తెలిపింది. “భారతీయులను ఆందోళనకు గురిచేసే ఇతర సమస్యలలో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానత, వాతావరణ మార్పు ఉన్నాయి” అని సర్వే తెలిపింది. ప్రపంచంలోని 28 దేశాలలో ఇప్సోస్ ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా, ప్రతి నెల ఈ సర్వేను నిర్వహిస్తుంది.