Police Posts : పోలీస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువత.. సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా..

|

Jan 04, 2021 | 6:20 PM

Police Posts : తెలంగాణలో ఇటీవల ఉద్యోగాల ప్రక్రియకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికి క్లారిటీ

Police Posts : పోలీస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువత.. సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా..
Follow us on

Police Posts : తెలంగాణలో ఇటీవల ఉద్యోగాల ప్రక్రియకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికి క్లారిటీ లేకపోవడంతో నిరుద్యోగుతలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న యాభై వేల పోస్టుల్లో 20 వేల వరకు పోలీస్ పోస్టులే ఉన్నాయి. ఇవి భర్తీ చేసినా ఇంకా పదివేల వరకు పోస్టులు ఉంటాయని పోలీస్ గణాంకాలు చెబుతున్నాయి.

కేంద్ర హోం శాఖ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విడుదల చేసిన డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి 476 మందికి ఒక పోలీస్ ఉండాలి కానీ ప్రస్తుతం 764 మందికి ఒక పోలీస్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యా్ప్తంగా పోలీస్ శాఖలో 78,369 పోస్టులుండగా ప్రస్తుతం 48,877 మంది పనిచేస్తున్నారు. మరో 29 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 20వేల పోస్టులకు బదులు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇక ఈ లెక్కలన్ని 2011 జనాభా లెక్కల ప్రకారమే ఉన్నాయి. తాజాగా తెలంగాణ జనాభా 4 కోట్లకు చేరుకోవడంతో మరింత సిబ్బందిని కేటాయించే అవసరం ఉంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 233 మందికి ఒక పోలీస్‌ను కేటాయించవలసి వస్తోంది. ఇదిలా ఉంటే శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించడంతో ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది.

మరిన్ని చదవండి:

Surabi Medical College : సిద్ధిపేట మెడికల్‌ కాలేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..