ఆ ఇద్దరంటే రాహుల్‌కు ‘అసూయ’…

|

Jul 13, 2020 | 8:37 PM

కాంగ్రెస్ నేత రాహుల్ పై తనదైన తరహాలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి. యువ నేతలైన జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలెట్ అంటే ఆయనకు అసూయ అని అన్నారు. రాజస్థాన్ లో ఆ పార్టీ దుస్థితికి రాహుల్ కారణమని ఆరోపించారు. సచిన్ పైలట్ బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తానంటూ ప్రకటించారు. సింథియా, సచిన్ ఇద్దరూ నా మేనలుళ్ల లాంటివారు అని అన్నారు. ఈ యువనేతలకు అవకాశం ఇస్తే తాను మరుగున పడిపోతానని రాహుల్ భావిస్తుంటాడని తెలిపారు. […]

ఆ ఇద్దరంటే రాహుల్‌కు అసూయ...
Follow us on

కాంగ్రెస్ నేత రాహుల్ పై తనదైన తరహాలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి. యువ నేతలైన జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలెట్ అంటే ఆయనకు అసూయ అని అన్నారు. రాజస్థాన్ లో ఆ పార్టీ దుస్థితికి రాహుల్ కారణమని ఆరోపించారు. సచిన్ పైలట్ బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తానంటూ ప్రకటించారు.

సింథియా, సచిన్ ఇద్దరూ నా మేనలుళ్ల లాంటివారు అని అన్నారు. ఈ యువనేతలకు అవకాశం ఇస్తే తాను మరుగున పడిపోతానని రాహుల్ భావిస్తుంటాడని తెలిపారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడక్కడ బలాబలాల అంశం కీలకంగా మారింది.