అలర్జీ ఉంటే ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ వద్దు.. యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ సూచన

| Edited By: Pardhasaradhi Peri

Dec 10, 2020 | 2:52 PM

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల్లోనే వ్యాక్సిన్ వల్ల దుష్ఫ్రభావాలు మొదలయ్యాయి.

అలర్జీ ఉంటే ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ వద్దు.. యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ సూచన
Follow us on

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల్లోనే వ్యాక్సిన్ వల్ల దుష్ఫ్రభావాలు మొదలయ్యాయి. ఫైజర్‌– బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నేషనల్‌ హెల్త్‌ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనైన విషయం తెలిసిందే. దీంతో యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది. అలర్జీ ఉన్న వాళ్లు లేదంటే మెడిసిన్ తీసుకుంటే అలర్జీకి గురయ్యేవారు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవొద్దని సూచించింది. అలర్జీలు ఉండేవారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్‌లు రావడం సాధారణమే అని చెప్పింది. వ్యాక్సిన్‌ తీసుకునేవారి మెడికల్‌ హిస్టరీ చూశాక టీకా ఇవ్వాలని సూచించింది.