మాల్యా కేసు: మళ్లీ మొదటికి

|

Jul 02, 2019 | 9:28 PM

లండన్‌: భారతీయ బ్యాంకులకు కుచ్చు టోపి పెట్టి లండన్ చెక్కేసిన లిక్కర్ టైకూన్ విజయ్‌ మాల్యాకు లండన్‌ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించేందుకు సానుకూలంగా గతంలో లండన్‌ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేసేందుకు అనుమతించాలని అతడు హైకోర్టులో వేసిన పిల్‌ మంగళవారం విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయస్థానం భారత్‌కు అప్పగించేందుకు గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ […]

మాల్యా కేసు: మళ్లీ మొదటికి
Follow us on

లండన్‌: భారతీయ బ్యాంకులకు కుచ్చు టోపి పెట్టి లండన్ చెక్కేసిన లిక్కర్ టైకూన్ విజయ్‌ మాల్యాకు లండన్‌ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించేందుకు సానుకూలంగా గతంలో లండన్‌ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేసేందుకు అనుమతించాలని అతడు హైకోర్టులో వేసిన పిల్‌ మంగళవారం విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయస్థానం భారత్‌కు అప్పగించేందుకు గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

విచారణ నిమిత్తం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సానుకూలంగా వెస్ట్‌మిన్‌స్టెర్‌ న్యాయస్థానం డిసెంబరు 2018న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా మొదటిసారి న్యాయస్థానంలో అభ్యర్థన తిరస్కారానికి గురైంది. మళ్లీ అతడు హైకోర్టును ఆశ్రయించగా వాదనలు కొనసాగాయి. కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలితే భారత్‌కు అతడిని అప్పగించే అవకాశాలు మెరుగ్గా ఉండేవి.