యుగాండా జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ !

|

Sep 17, 2020 | 9:04 PM

యుగాండా దేశంలోని ఓ జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు  ప్రారంభించారు.

యుగాండా జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ !
Follow us on

యుగాండా దేశంలోని ఓ జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు  ప్రారంభించారు. మొరాటోలోని జైలు నుంచి పారిపోయిన ఖైదీలు ఒక సైనికుడిని హతమార్చారు. ఆ తరువాత అక్కడి కొండ ప్రాంతాల్లోకి ఎస్కేప్ అయ్యారు. వారు దాదాపు 15 తుపాకులు, మందు గుండు సామగ్రి కూడా తమతో పాటు తీసుకెళ్లారు. ఆ ఖైదీల కోసం పోలీసులు, జైలు అధికారులు వెతుకులాట ప్రారంభించారు.

అయితే, ఇద్దరు ఖైదీలు పోలీసు కాల్పుల్లో చనిపోయారని, ఇద్దరిని పట్టుకోగలిగామని యుగాండా ఆర్మి అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ కాల్పుల ఘటనతో మొరాటో సిటీలో జన జీవితం దాదాపు స్తంభించి పోయిందని తెలిసింది. ఖైదీలు తాము ఎవరి కంటా పడకుండా ఉండేందుకు తమ పసుపు రంగు దుస్తులు విడిచి నగ్నంగా పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్