మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి

|

Sep 08, 2020 | 6:24 PM

గుజరాత్ లోని ఓ మురుగునీటి పైప్‌లైన్‌ను శుభ్రం చేస్తుండగా ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. సూర‌త్‌లో సోమ‌వారం మ్యాన్‌హోల్ శుభ్ర‌ప‌రుస్తుండ‌గా ఊప‌రాడ‌క ఇద్ద‌రు పారిశుధ్య కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి
Follow us on

గుజరాత్ లోని ఓ మురుగునీటి పైప్‌లైన్‌ను శుభ్రం చేస్తుండగా ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. సూర‌త్‌లో సోమ‌వారం మ్యాన్‌హోల్ శుభ్ర‌ప‌రుస్తుండ‌గా ఊప‌రాడ‌క ఇద్ద‌రు పారిశుధ్య కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాన్‌పురా ప్రాంతంలో ఇటీవ‌ల తుఫాను కార‌ణంగా పూడిక‌తో నిండిన మ్యాన్‌హోళ్ల‌ను శుభ్ర‌ప‌ర్చే ప‌నుల‌ను సూర‌త్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో నీటి ప్రవాహాన్ని సమీపంలోని మురుగునీటి మార్గంలోకి మళ్లించడానికి మ్యాన్‌హోల్‌లోకి మాచివాడ్ సర్కిల్ వద్ద మోన్సింగ్ అమాలియా (52), జయేంద్ర అమాలియా (25) అనే కార్మికులు దిగారు. పూర్తిగా ఎండిపోయి ఉన్న మ్యాన్‌హోల్‌లో విష‌వాయువులు వ్యాపించ‌డంతో ఇద్ద‌రూ అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారు. ఇత‌ర సిబ్బంది గుర్తించి కాంట్రాక్ట‌ర్‌కు స‌మాచారం అందించారు.

కార్మికులు ఎలాంటి సురక్షిత పరికరాలు అమర్చుకోకుండానే మ్యాన్‌హోల్ లోనికి దిగినట్టు స్థానికులు చెబుతున్నారు. వీరు మాన్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విషవాయువులు వ్యాపించాయి. కాగా, అక్కడికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించి తాడు సాయంతో ఇద్ద‌రినీ బ‌య‌ట‌కు తీసి ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందార‌ని వైద్యులు ధృవీక‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన పోలీసులు కాంట్రాక్ట‌ర్‌పై కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు కార్మికుల మృతిపై విచారణను ఆదేశాలు జారీ చేశామని సూరత్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ బీఎన్ పానీ తెలిపారు. నివేదిక అధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీటిని శుభ్రం చేయడానికి మాకు యంత్రాలున్నాయి. వాటిని ఎందుకు ఉప‌యోగించ‌లేదో తెలియ‌డం లేదన్నారు ఆయన.