ఢిల్లీలో బర్ద్ ఫ్లూ కలకలం, వారం రోజుల్లో 200 కాకులు మృతి, మయూర్ విహార్ పార్క్ లో విజిటర్లకు నో పర్మిషన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2021 | 2:53 PM

ఢిల్లీలో ఒక్కసారిగా బర్ద్ ఫ్లూ బెడద రేగింది. ఇక్కడి మయూర్ విహార్ పార్కులో నిన్న ఒక రోజే సుమారు 20 కాకులు మరణించాయి. వారం రోజుల్లో సుమారు 200 కాకులు

ఢిల్లీలో బర్ద్ ఫ్లూ కలకలం, వారం రోజుల్లో 200 కాకులు మృతి, మయూర్ విహార్ పార్క్ లో విజిటర్లకు నో పర్మిషన్
Follow us on

Two Hundred Crows Dead:ఢిల్లీలో ఒక్కసారిగా బర్ద్ ఫ్లూ బెడద రేగింది. ఇక్కడి మయూర్ విహార్ పార్కులో నిన్న ఒక రోజే సుమారు 20 కాకులు మరణించాయి. వారం రోజుల్లో సుమారు 200 కాకులు మృతి చెందాయని ఈ పార్కు  కేర్ టేకర్ తెలిపారు. పశువైద్య సిబ్బంది వచ్చి 5 కాకుల డెడ్ బాడీలను తీసుకువెళ్లారని, ముందు జాగ్రత్త  చర్యగా విజిటర్లకు పార్కును మూసివేస్తున్నామని ఆయన చెప్పాడు. నగరంలో కాకుల మృతి ఇదే మొదటిసారి అని ఆయన అన్నాడు.  ఇలా బాతులు, కోడిపిల్లలు  వేల సంఖ్యలో హఠాత్తుగా మరణిస్తున్నా.. వీటి మృతికి సంబంధించి ల్యాబ్ ల్లో ఇంకా టెస్టులు నిర్వహిస్తున్నారు.  పక్షుల మరణాలకు ఖఛ్చితమైన కారణాలను విశ్లేషించలేకపోతున్నారు.

బర్ద్ ఫ్లూ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం కావాలని సూచించింది. యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలనీ కోరింది. కేరళ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫ్లూగా ఉన్నట్టు తేలితే సంబంధిత ప్రాంతాన్ని డిస్ ఇన్ ఫెక్ట్   చేయాలని అధికారులు  సూచించారు. మనిషికి ఇది సోకితే ఈ వైరల్ శరీరంలో 10 రోజులపాటు ఉంటుంది. గొంతు మంట, తలనొప్పి, ఫీవర్, డయేరియా, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి వివిధ రుగ్మతలు తలెత్తుతాయి.

 

Also Read:

Religious Tourism In AP: కాశీ క్షేత్రమంత పవిత్రమైన త్రేత్రాయుగం నాటి శైవ క్షేత్రం.. జుత్తిగ సోమేశ్వర స్వామి ఆలయ విశిష్టత..

Delhi Govt New Bag Policy: ఇకపై ఆరాష్ట్రంలో తగ్గనున్న విద్యార్థుల బ్యాగ్ బరువు మోత, కాదంటే స్కూల్ యజమానులకు మోతే..

కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ‘మేఘా’ నిర్మించిన క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి