Delhi Govt New Bag Policy: ఇకపై ఆరాష్ట్రంలో తగ్గనున్న విద్యార్థుల బ్యాగ్ బరువు మోత, కాదంటే స్కూల్ యజమానులకు మోతే..

చదివేది ఎల్ కేజీ విద్యార్థి బరువుకంటే.. ఎక్కువ బరువైన పుస్తకాలు బ్యాగ్.. మోయలేక మోయలేక స్కూల్‌కు వెళ్తుంటే.. ఆ విద్యార్థిని చూసి అయ్యోపాపం అని అనని వారుండరు. అయితే ఢిల్లీ సర్కార్ విద్యార్థులకు

Delhi Govt New Bag Policy: ఇకపై ఆరాష్ట్రంలో తగ్గనున్న విద్యార్థుల బ్యాగ్ బరువు మోత, కాదంటే స్కూల్ యజమానులకు మోతే..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 2:11 PM

Delhi Govt New Bag Policy: చదివేది ఎల్ కేజీ విద్యార్థి బరువుకంటే.. ఎక్కువ బరువైన పుస్తకాలు బ్యాగ్.. మోయలేక మోయలేక స్కూల్‌కు వెళ్తుంటే.. ఆ విద్యార్థిని చూసి అయ్యోపాపం అని అనని వారుండరు. అయితే ఢిల్లీ సర్కార్ విద్యార్థులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పాఠశాల బ్యాగ్‌ల బరువును తగ్గించడానికి కొత్త ‘స్కూల్ బ్యాగ్ విధానం’ అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను ఆదేశించింది.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉండే పాలసీ ప్రకారం తరచుగా బ్యాగ్‌ల తనిఖీలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సూచన ప్రకారం 1-10 తరగతుల మధ్య విద్యార్థుల కోసం పాఠశాల బ్యాగ్‌ల బరువు వారి శరీర బరువులో 10 శాతం మించకూడదని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ప్రాథమిక, హై స్కూల్ విద్యార్థుల పుస్తకాల బరువు ను తగ్గించడానికి సీఎం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేశారు. స్కూల్ బాగ్ పాలసీ 2020 ప్రకారం, వివిధ తరగతుల విద్యార్థులకు పాఠశాల సంచులకు బరువు పరిమితిని మించరాదని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ బ్యాగు బరువును నిర్థేశిస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఉత్తర్వులు అమలులోకి వస్తే విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది. ర్యాంకులే ప్రామాణికంగా భావించే పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతిదానికో పుస్తకమంటూ విద్యార్థులపై బండెడు మోత వేశారు. ఫలితంగా ఎల్‌కెజి, యుకెజి నుంచి బ్యాగు నిండా పుస్తకాలు ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకటోతరగతి చిన్నారి సుమారు 10 కిలోల బ్యాగు మోస్తున్నాడు. బ్యాగు బరువు మార్గదర్శకాలపై అన్ని పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల్లో కూడా అవగాహన ఏర్పడితే పూర్తి స్థాయిలో అమలు సాధ్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: రామతీర్థంలో ధ్వంసమైన రాములవారి విగ్రహం తయారీ ఎక్కడో తెలుసా..!