పాతబస్తీలో దారుణం: అక్కాచెల్లెళ్ళపై అఘాయిత్యం.. ఆపై..

|

Mar 18, 2020 | 5:45 PM

Two minor girls raped by five persons: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్ళపై అయిదుగురు కామాంధులు అత్యాచారం చేశారు. బాధిత అమ్మాయిలు బోరున విలపిస్తూ తమ ఇంట్లోవారికి చెప్పడంతో వారు కమాటిపురా పోలీసులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అయిదుగురని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అయిదుగురిలో ముగ్గురు మైనర్ బాలురు కావడం గమనార్హం. అక్కా చెల్లెళ్ళలో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతుండగా.. మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిలో […]

పాతబస్తీలో దారుణం: అక్కాచెల్లెళ్ళపై అఘాయిత్యం.. ఆపై..
Follow us on

Two minor girls raped by five persons: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్ళపై అయిదుగురు కామాంధులు అత్యాచారం చేశారు. బాధిత అమ్మాయిలు బోరున విలపిస్తూ తమ ఇంట్లోవారికి చెప్పడంతో వారు కమాటిపురా పోలీసులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అయిదుగురని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అయిదుగురిలో ముగ్గురు మైనర్ బాలురు కావడం గమనార్హం.

అక్కా చెల్లెళ్ళలో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతుండగా.. మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిలో పెద్దమ్మాయిని ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టిన ఓ యువకుడు.. అత్యాచారం చేశాడు. ఆ విషయం అందరికీ చెబుతానని బెదిరించి.. తన నలుగురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆమె చెల్లెలితో ఈ గ్రూపులో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె, తన అక్కతో కలిసి జరిగిందంతా తమ పేరెంట్స్‌కి తెలిపారు. అక్కా చెల్లెళ్ళ తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కామాటిపురా పోలీసులు.. ఈ అయిదుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ అత్యాచార ఉదంతంపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.